
ఇటిక్యాల/ గద్వాల, వెలుగు: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను పారదర్శకంగా చేపట్టి కంప్లీట్ చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించి ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో మంజూరైన ఉపాధి హామీ నిధుల్లో 60 శాతం వ్యవసాయ అనుబంధ పనులకు కేటాయించాలన్నారు. ఉపాధి హామీ పనులకు సంబందించిన మెజర్‌మెంట్ బుక్, మస్టర్ రోల్‌ను పరిశీలించి అన్ని రిజిస్టర్లు స్పష్టంగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు సూచించారు.
పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఎంపీడీఓ అజార్ మొహిముద్దీన్, ఏపీఓ శివ జ్యోతి, టీఏలు కృష్ణయ్య, లావణ్య, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ పై ప్రణాళికలు రూపొందించాలి
స్కిల్ డెవలప్మెంట్ పై ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వృత్తి నైపుణ్య అభివృద్ధి మీటింగ్ నిర్వహించారు. జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.